ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరై న నేతలు జాతీయ స్థాయిలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణ పై సమావేశాల్లో చర్చించామన్నారు. 2024లో ఏపీలో జరిగే ఎన్నికలకే ప్రాధాన్యత ఇచ్చాం అన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో పార్టీ నిర్వహించిన ప్రజా ఆందోళనలు, ఉద్యమాలపై చర్చ జరిగింది.
ఏపీలో ప్రాంతాల వారీగా పార్టీ నిర్వహించిన ఉద్యమాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా నిర్వహించిన “ప్రజాపోరు” యాత్రలు, సభలు ఏవిధంగా కొనసాగించింది ప్రెజెంటేషన్ ఇచ్చాం.ఈ తరహా “ప్రజాపోరు” యాత్రలు నిర్వహించాలని బిజెపి అధికారం లేని రాష్ట్రాలలోని బిజెపి శాఖ లు కూడా నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. ఏపి లో నిర్వహించిన ప్రజా ఆందోళనలపై ఇచ్చిన “ప్రెజెంటేషన్”జాతీయ నాయకులను ఆకట్టుకుందన్నారు సోము వీర్రాజు.
ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ కీలక సందేశాలిచ్చారు. భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందన్నారు మోడీ. దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామిని చేస్తూ ముందుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి సందేశం. అప్పుడే సమగ్రమైన పురోగతి సాధ్యమని ప్రధాని చెప్పారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 2024 పార్లమెంటు ఎన్నికలు నడ్డాగారి నేతృత్వంలోనే.. ఆలోపలే 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా వస్తాయన్నారు. టీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. వారిని త్వరలోనే ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయం అన్నారు కిషన్ రెడ్డి.
ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జేపీ నడ్డా నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారన్నారు.
Read Also: Military Threat: చైనా తర్వాత అమెరికా నుంచే భారత్‌కు ముప్పు.. సర్వేలో భారతీయుల అభిప్రాయం