ఏపీ లో సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఏపీ ఫిలిం ఛాంబర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖ లో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఆన్లైన్ టికెట్ సదుపాయం ను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఇస్తామని లేఖలో వివరించింది.…