Bandi Srinivas : పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం ఏర్పడింది. బిల్లులు పాస్ చేయకుండానే క్రెడిట్ డబ్బులు అయ్యాయి. ఉద్యోగులకు సంబంధం లేకుండానే డబ్బులు విత్‌డ్రా అవ్వడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనను ఆర్ధిక శాఖ అధికారుల దృష్టికి ఎన్జీవో అసోసియేషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు విత్ డ్రా అవటం పై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అంశాన్ని ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ రావత్, సత్యనారాయణలను కలిసి వివరించామని, పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారన్నారు.
సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉంటుందని తెలిపినట్లు, ఈ సాయంత్రం ఐదు గంటల వరకు ఏం జరిగిందో స్పష్టత ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కింది స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. సీఎఫ్ఎమ్‌ఎస్ విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సీఎఫ్ఎమ్‌ఎస్ వ్యవస్థను రద్దు చేసి పాత ట్రెజరీ విధానాన్నే తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంబంధిత అధికారులు బిల్లులు పాస్ చేయకుండానే కొంత మంది ఉద్యోగులకు డబ్బులు క్రెడిట్ అయినట్లు గమనించారన్నారు. 1-7-2018, 1-1-2019 డీఏ ఎరియర్స్ వేశామని అంటున్నారు అవి క్రెడిట్ కాలేదని చెప్పామన్నారు.
Also Read
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!