AP CM Jaganmohan Reddy: రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. 10.40 – 12.30 గంటల వరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోనున్నారు. ఏపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్, ఉత్పత్తులు ప్రారంభించిన అనంతరం.. మరికొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు.
AP CM Jaganmohan Reddy: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
మధ్యాహ్నం 12.40 గంటలకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి చేరుకోనున్నారు. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. 3.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.