Ivory Smugglers: హైదరాబాద్ నగరంలో పట్టుబడిన ఏనుగు దంతాల కేసులో విచారణను వేగవంతం చేశారు. 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో చోరికి గురైన ఏనుగు దంతాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు చెందిన రేకులగుంట ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.. మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కోసం గాలింపు కొనసాగుతుంది. కాగా, 2013లో తలకోన అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు రెండు ఏనుగులు మృతి చెందాయి. ఆ ఏనుగుల దంతాలు తొలగించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో అధికారులు భద్రపరిచారు.
Read Also: AP BJP President: నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్.. కొత్త ప్రెసిడెంట్ ఎవరో..?
అయితే, 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో రెండు ఏనుగు దంతాలు, ఒక 12 బోర్ పంప్ యాక్షన్ గన్ చోరీకి గురి అయ్యాయి. 2023 నవంబర్ 20వ తేదీన భాకరాపేట పోలీస్ స్టేషన్ లో (క్రైం నెంబర్ 87/2023) కింద కేసు నమోదు అయింది. ఇ, ఈ రెండు ఏనుగు దంతాల విలువ సుమారు 70 వేల రూపాయలుగా ఉంటుందని ఎఫ్ఐఆర్ కాపీలో చూపించారు ఫారెస్ట్ అధికారులు.