Ivory Smugglers: హైదరాబాద్ నగరంలో పట్టుబడిన ఏనుగు దంతాల కేసులో విచారణను వేగవంతం చేశారు. 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో చోరికి గురైన ఏనుగు దంతాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు చెందిన రేకులగుంట ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు.. కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. వన్యప్రాణుల చర్మం, దంతాలతో వ్యాపారం షురూ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో వాటి స్మగ్లింగ్‌కు తెరతీశారు. తాజాగా ఏనుగు దంతాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ అడవిలోని ఎర్రచందనం చెట్ల వెంట పడ్డ స్మగ్లర్లు.. ఇప్పుడు అడవిలోని వన్యప్రాణులను కూడా వదిలి పెట్టడం లేదు. వాటిని వెంటాడి.. వేటాడి వాటి చర్మం, దంతాలతో స్మగ్లింగ్ వ్యాపారం…
ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.…
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ…