రాకెట్ ఇంధనం అందిస్తున్న ఆంధ్రా షుగర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తణుకులోనిలోని ఆంధ్రా షుగర్స్ భారతీయ అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ప్రయోగా లకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రా షుగర్స్ విజయం సాధించింది. ఇస్రో- ఆంధ్రాషుగర్స్ సహ కారం 1984లో ప్రారంభం కాగా 1985లో మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారం భానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రా షుగర్స్ కు మధ్య ఒప్పందం జరిగింది.1988 జూలై4 ప్లాంటును జాతికి అంకితం చేశా రు. కీలకమైన అంతరిక్ష పరిశోధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో ఇస్రో- ఆంధ్రా షుగర్స్ మధ్యన ఏర్పడిన సహకారం అతి ముఖ్యమైనది.
రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన చిత్రపటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించడంలో ఆంధ్రా షుగర్స్ ముఖ్య పాత్రను పోషించింది. తణుకు ఫ్లాంట్‌లో ఉత్పత్తి చేసి న ద్రవరూప ఇంధనం భారత మొట్టమొదటి స్వదేశి పరిజ్ఞానంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV- D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకులో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ రాకెట్ ఇంధన తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది ఈ పరిశ్రమ.
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్‌లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!