ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై ప్రధానంగా చర్చించారు సీఎం.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది..
కొత్త ఐటీ పాలసీపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్.. అందులో భాగంగా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..
2021-24 ఐటీ పాలసీ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు.. ఇన్‌క్యూబేషన్ సెంటర్లు, స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్.. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.. రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో రూ. 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఐటీ…