ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్‌లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.. దాని ప్రకారం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్.. 97.89 శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండో స్థానంలో ఉంది.. ఇక, 96.97 శాతంలో తర్వాత స్థానంలో తమిళనాడు.. 94.86 శాతంతో నాల్గో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.. టాప్ అచివర్స్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి..
Read Also: Chandrababu: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ఫైర్
4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. టాప్ అచీవర్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుంది.. అయితే, గతంలో ఎన్నడూ లేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.. 10,200 మంది పెట్టుబడిదారులు, స్టేక్ హోల్డర్ల నుండి అభిప్రాయాలు సేకరించింది.. అయితే, అన్ని రంగాల్లోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తమైనట్టుగా చెబుతున్నారు.. మొత్తం 4 క్యాటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది కేంద్రం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 97.89 శాతం స్కోర్‌తో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. గుజరాత్ 97.77 శాతం, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతంతో వరుస స్థానాల్లో నిలిచాయి.. రెండో జాబితాలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు 80-90 శాతం స్కోర్‌తో ఉన్నాయి. అలాగే అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 50 నుంచి 80 శాతం స్కోరుతో మూడో జాబితాలో ఉండగా.. ఢిల్లీ, బీహార్, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు 50 శాతం కంటే తక్కువ స్కోర్ చేశాయి.
