High Court: అయ్యన్నపాత్రుడిపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు అంగీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భూకబ్జా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు విషయంలో అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Heroines Education : టాప్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా?
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తన క్లెయింట్‌పై ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 467 నమోదు చేశారని.. ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మరోవైపు సీఐడీ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ అయ్యన్నపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని.. అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. కానీ హైకోర్టు మాత్రం సెక్షన్ 467 వర్తించదని తీర్పు చెప్పింది. అటు జల వనరుల శాఖ ఇచ్చిన ఎన్వోసీ.. విలువైన పత్రాల కేటగిరి కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సెక్షన్ వర్తించనందున.. సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో విశాఖ కోర్టు అయ్యన్నపాత్రుడిని రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!