High Court: భూకబ్జా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు విషయంలో…