దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పై విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో విజయవాడ దుర్గగుడిలో ఈవోగా పని చేసిన కాలంలో ఆజాద్ పై ఆరోపణలు రాగా… ఇప్పుడు విచారణను ఆదేశించింది సర్కార్.. విచారణాధికారిగా దేవదాయ శాఖ కమిషనర్ అర్జున రావును నియమించారు.. అయితే, ఆజాద్ పై అవకతవకలు ఆరోపణలపై గతంలో విచారణాధికారిగా ఉన్న పద్మ రిటైర్ కావడంతో ఆమె స్థానంలో అర్జునరావును నియమించింది ప్రభుత్వం… చంద్రశేఖర్ ఆజాద్‌పై విచారణను నెల రోజుల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.