తెలుగు అకాడమీ పేరును మార్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలుగు అకాడమీ పేరును.. తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… ఇక, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురిని నియమించింది సర్కార్… తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నెరేళ్ల రాజ్‌కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం విజయశ్రీ, ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్ కప్పగంతు రామకృష్ణను అకాడమీ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మురళీధర శర్మను యూజీసీ నామినీగా నియమించింది. ఇక, తెలుగు- సంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.