ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. గత మూడు నాలుగు రోజులుగా మళ్లీ తగ్గుతూ వస్తుంది.. అయినా.. భారీగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కు చేరుకోగా.. మృతుల సంఖ్య 14,594కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21,30,162కు పెరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.