ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య పైకి కిందికి కదులుతూనే ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,522 శాంపిల్స్ పరీక్షించగా 1,679 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 9,598 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
Read Also: Narayana: చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు..!
ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 3,27,33,406కు చేరుకుంది… ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 23,08,622కు చేరుకోగా.. రికవరీ కేసులు 22,47,824కి పెరిగాయి.. మృతుల సంఖ్య 14,679కు చేరితే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,119గా ఉన్నాయి.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త కేసులు నమోదయ్యాయి.. కృష్ణా జిల్లాలో 225, గుంటూరు జిల్లాలో 212 కేసులు నమోదైనట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.