AP Tourism: పర్యాటక రంగంపై సీఎం జగన్ ఫోకస్.. వారికి గుడ్‌న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి పస్ట్‌వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుపుతూ వచ్చారు అధికారులు.. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించారు.
Read Also: Twin Towers Demolition: 9 సెకన్లలో ముగిసిన తొమ్మిదేళ్ల సుదీర్ఘ యుద్ధం.. కూల్చేశారు కానీ..
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
వారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడపనున్నారు.. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం… షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుంది.. ఇక, తిరిగి సాయంత్రం 6.35 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరే ఆ విమానం.. రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకోనుంది.. ఈ విమాన ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, 2017 మే నెలలోనే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ హోదా కల్పించింది కేంద్ర సర్కార్.. ఇక, 2019లో 6 నెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య వారానికి ఒక సర్వీస్ నడిపారు.. కానీ, సాంకేతిక కారణాలతో అది కూడా రద్దు చేశారు.. ఆ తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ప్రయత్నాలు జరిగానా కోవిడ్ ఎఫెక్ట్‌తో అదికూడా సాధ్యపడలేదు.. కేవలం వందేభారత్ మిషన్‌లో భాగంగా కొన్ని సర్వీసులను మాత్రమే నడిపారు.. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు తిరిగి సన్నహాలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!