త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో…
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. Also Read:Missing Plane…
ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రూ.1,332 కోట్లతో తిరుపతి – పాకాల – కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.. తిరుపతి - పాకాల - కాట్పాడిల మధ్య మొత్తం 104 కిలో మీటర్ల మార్గంలో రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది
రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఆయన.. చిన్నయ్య సూరి పేరిట సత్కారం చేశారు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి పేరిట సత్కారం పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు..
టూరిజంపై ఫోకస్ పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో టూరిజం శాఖపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పీపీపీ మోడ్ లో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను పిలుస్తున్నాం అన్నారు.. PPPలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు..
AP Tourism coffee table books: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ బాషల్లో ఈ పుస్తకాలను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి…