Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ‘ఒకే దేశం – ఒకే రేషన్ కార్డు’ (ONORC) పథకం కింద కీలక మార్పులు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, అర్హులైన లబ్ధిదారులు ఇకపై దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచైనా తమ రేషన్‌ను పొందవచ్చు. ఒకే రేషన్ దుకాణంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా ధాన్యాన్ని సేకరించుకునే అవకాశం కల్పించింది.
ప్రస్తుతం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద కోట్లాది మంది ప్రజలు రాయితీ ధరకే బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పొందుతున్నారు. ఈ కొత్త విధానంతో లబ్ధిదారులు ఒక దుకాణం నుంచి బియ్యం, మరో దుకాణం నుంచి గోధుమలు తీసుకునే వెసులుబాటు పొందనున్నారు. సరుకుల కొరత, సాంకేతిక సమస్యలు లేదా అధిక రద్దీ కారణంగా రేషన్ పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఈ విధానం బ్యాంకింగ్ వ్యవస్థలోని ఏటీఎం సేవల మాదిరిగానే పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా ఎక్కడ ఉన్నా దేశంలోని ఏ ఏటీఎం నుంచైనా నగదు తీసుకునే విధంగా, రేషన్ కార్డుదారులు కూడా తమకు అనుకూలమైన ఏ రేషన్ దుకాణం నుంచైనా ధాన్యాన్ని పొందవచ్చు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యంగా వలస కార్మికులు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. తమ స్వగ్రామంలోని రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే రేషన్ పొందే అవకాశం కలగనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!