Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్..
- హత్య చేసిన తర్వాత తొలి మాటలే అబద్ధం..
- సెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పిన సియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal case: దేశవ్యాప్తంగా పూణేకు చెందిన కేతన్ అగర్వార్ హత్య కేసు సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్య చేశారు. పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్దామని చెప్పి, ఆ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. జూన్ 18న కేతన్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత, సియా తన నోటి నుంచి తొలి అబద్ధాన్ని చెప్పింది. కోట వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ధీరజ్ జాధవ్ ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు.
హత్య తర్వాత, తాను కేకలు విని పరిగెత్తుకుంటూ వెళ్లానని, అక్కడ సియా గోయల్‌ను ఏం జరిగిందని ప్రశ్నించినట్లు జాధవ్ చెప్పారు. దీనికి సియా ‘‘ఇక్కడి నుంచి ఎవరో కిందపడిపోయారు’’ అని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కేతన్‌ను లోయలోకి తోసేసిన తర్వాత ‘‘హెల్ప్.. హెల్ప్..’’ అంటూ అరిచినట్లు గార్డు చెప్పారు. అయితే, ఆ సమయంలో మరే వివరాలు చెప్పలేదని, తాను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు.
Also Read
ఈ కేసులో సియా గోయల్(20), చేతన్ చౌదరి(22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి కేతన్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు రోజు సియా, చేతన్ పూణేలోని ఒక కేఫేలో గంటల తరబడి హత్యకు పథకం రచించినట్లు వెల్లడైంది. కొన్ని నెలల వ్యవధిలో ఇద్దరి మధ్య ఏకంగా 2004 ఫోన్ కాల్స్ వెళ్లాయని, 238 గంటలకు పైగా మాట్లాడుకున్నారనే వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు ముందు కూడా జూన్ 14న లోహ్‌గఢ్ కోట సందర్శన సమయంలో సియా కేతన్‌ను తోసేసింది. ఆ సమయంలో ఒక పొదను కేతన్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. పాము కనిపించడంతో నిన్ను కాపడటానికే తోసేసినట్లు సియా చెప్పింది. ఆమె మాటలు నమ్మిన కేతన్ చివరకు జూన్ 18న కుట్రకు బలయ్యాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు