ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చినా.. వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రానున్న ఎలక్షన్స్ లో తాము 150 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరపురంలోని రూరల్ నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.
Also Read : Jagadish Shettar: “నా ఓటమికి కారణం అదే”.. కర్ణాటక మాజీ సీఎం వ్యాఖ్యలు..
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చినా.. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మీరు ( తెలుగుదేశం-జనసేన పార్టీలు ) పొత్తులు పెట్టుకుంటే చూసి వైసీపీ పార్టీ భయపడే అవసరం లేదు అని ఆయన అన్నారు. రాజకీయంగా మేము టీడీపీ పార్టీ లాగా ఊత కట్టి పట్టుకుని నడిచే స్థితిలో లేము అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Also Read : IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
2024 లో కూడా సీఎం జగన్ సారథ్యంలో వైసీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తాం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాకు ఎవరు కలిసి పోటీ చేసిన వచ్చే ఇబ్బంది ఏమి లేదు అని చెప్పుకొచ్చారు. 2019లో వచ్చిన 151 సీట్ల కంటే.. 2024లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు సాధిస్తాం అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. ముందు అయన గెలుస్తారో లేదో ఆలోచన చేసుకోవాలి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కల్యాణ్ టీడీపీతో పోత్తు పెట్టుకుంటున్నారంటూ విమర్శించారు.