Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!
- సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల
- ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
- సోషల్ మీడియాలో దేవర ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PIL on Devara Ticket Prices in AP High Court: ప్రస్తుతం ఎవరిని కదిపినా.. ‘దేవర’ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవర అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
దేవర సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పిటిషనర్ పిల్ వేశారు. 10 రోజులకు మాత్రమే అనుమతి ఉండగా.. 14 రోజులకు ధరలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడంను సవాలు చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
టికెట్ ధరలు, స్పెషల్ షోల విషయంపై ఇటీవల దేవర టీమ్ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా.. సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 28 నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలానే సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్‌కు రూ.110, లోవర్ క్లాస్‌కు రూ.60, మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?