Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, అమరావతి అంశంపై చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను అవకాశవాది కాదని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయని, రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. పేర్ని నాని మాత్రం అవకాశాల కోసం పార్టీలు మారే నాయకుడని విమర్శించారు.
జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని, ఆయన విధానాలు, సిద్ధాంతాలనే ప్రశ్నిస్తున్నానని సత్యకుమార్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రభుత్వంపై చేసే విమర్శలను సహించబోనని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. అవసరమైతే ఈ అంశంపై ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలని కూడా సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మార్పులు అవసరమని అంగీకరిస్తూ, వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!