Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?
- అనంతపురం జిల్లా ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయం..
- మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా?..
- మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? నిజమే, ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల మనిషిలోని చెడు గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు? అవుననే అంటున్నారు మందు బాబులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లి పూలమాలలు వేస్తే మద్యానికి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామిని ఆంధ్ర పుండరీపురంగా పిలుస్తారు. ఆలయ గొప్పతనం గురించి తెలియని మందు బాబులు ఇక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. తాగుబోతులను పోగొట్టే దైవంగా ఉంతకల్లులో వెలసిన పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి ఆలయం మందు బాబులతో కిటకిటలాడుతుంది.
Read also: Health Tips: టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..?
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిస్తే. మెడలో పాండురంగ స్వామి దండ ఉంటే తాగి చాలా దూరం పరిగెత్తేవాడట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాండురంగ స్వామి మాల మాసంలోని శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లో మాత్రమే ధరించాలి. తాగుబోతులు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం చాలా ఏళ్లుగా ఆచారం. స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందు తాగడం మానేయాలనే దృఢ సంకల్పంతో మాలధారణ చేయాలనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తుల మెడలో పాండురంగ స్వామి మాల వేస్తారు. పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారికి మళ్లీ మద్యం ముట్టిన దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మద్యానికి బానిసలైన వారు స్వామివారి ఆలయానికి వచ్చి మాలధారణ చేసిన తర్వాత మద్యానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతారన్నారు.
Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్.. ఎగబడుతున్న జనం!
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!