Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోవడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం అత్యంత కీలకమని, ఇటువంటి దశలో లభించిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ, ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉండిందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ ఇచ్చిన తర్వాత ఏ జట్టు అయినా మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిందేనని, కానీ ఈ విషయంలో శ్రీలంక జట్టు అత్యుత్తమ పోరాట పటిమను ప్రదర్శించి మ్యాచ్‌ను డ్రా చేసుకుందని కొనియాడారు. మైదానంలో కేవలం మ్యాచ్‌ను డ్రా చేసే వారి కంటే, ఎలాగైనా గెలిపించే క్రీడాకారులే జట్టుకు చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
జట్టులోకి వర్ధమాన, యువ ఆటగాళ్లు రావడం చాలా మంచి పరిణామమని, అయితే ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు సమిష్టి విజయం కోసం ఆడటం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. జట్టు యాజమాన్యం , సెలెక్టర్లు తమ బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని పేర్కొన్న ఆయన, తుది జట్టులో సీనియర్లు లేదా జూనియర్లు అనే వ్యత్యాసం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. అవకాశం లభించిన ప్రతిసారీ ఏ స్థాయి ఆటగాడైనా దానిని అందిపుచ్చుకుని జట్టును విజేతగా నిలిపేందుకు ప్రయత్నించాలని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!