NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి నేల, నిర్జనమైన కొండలే గుర్తుకొస్తాయి. కానీ, ఇటీవల నాసాకు చెందిన ‘క్యూరియాసిటీ రోవర్’ పంపిన ఒక విచిత్రమైన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాతి గుట్టల పైన ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక నల్లటి నీడ ఆ ఫొటోలో కనిపించింది. సరిగ్గా సముద్రంలో ఈతకొట్టే ‘జెల్లీఫిష్’ ఆకారంలో ఉండటంతో ఇది గ్రహాంతరవాసే (ఏలియన్)! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఏలియన్స్ లాగా ఉందంటూ రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. అయితే, నాసా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి లోతుగా పరిశోధించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి నాసా రోవర్లు పంపే ఫొటోల్లో గతంలో కూడా మానవ పుర్రెలు, ఎముకలు, పిరమిడ్లు, పుట్టగొడుగులు వంటి ఆకారాలు కనిపించాయి. మన మెదడుకు తెలిసిన ఆకారాలను తెలియని వస్తువుల్లో ఊహించుకోవడాన్ని సైన్స్ భాషలో ‘పారైడోలియా’ (Pareidolia) అంటారు. ప్రతిసారీ విచిత్రమైన రాళ్లే దీనికి కారణమయ్యేవి. కానీ, ఈసారి కనిపించిన జెల్లీఫిష్ ఆకారం నేలపై ఉన్న రాయి కాదు, గాలిలో తేలుతున్న నీడలా ఉంది. క్యూరియాసిటీ రోవర్ తన ‘నావ్‌క్యామ్’ (Navcam) కెమెరాతో తీసిన ఈ దృశ్యం నిజంగానే ఒక వింత జీవి ఎగురుతున్న భావనను కలిగించింది. అయితే శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించడానికి రోవర్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వింత ఫొటో 2023 ఆగస్టు 20న రికార్డయ్యింది. సాధారణంగా రోవర్లు ఒకే కోణంలో వరుసగా ఫొటోలు తీస్తాయి. ఈ జెల్లీఫిష్ ఫొటో తీయడానికి సరిగ్గా 13 సెకన్ల ముందు, అలాగే 25 సెకన్ల ముందు కూడా అదే ప్రదేశాన్ని కెమెరా క్లిక్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే… ఆ రెండు పాత ఫొటోల్లో ఎలాంటి నీడ లేదు! కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్‌లో మాత్రమే ఆ నల్లటి ఆకారం ప్రత్యక్షమైంది. అక్కడ నిజంగానే ఏదైనా జీవి ఉండి ఉంటే, అది మిగతా ఫొటోల్లో కూడా కనిపించాలి కదా? దీంతో ఆ వింత సంఘటన అంగారకుడి నేలపై జరిగింది కాదని స్పష్టమైంది.
Also Read
- Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
- Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
మరి ఆ ఆకారం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం సుదూర అంతరిక్షం వైపు చూడాలి. విశ్వంలో నిరంతరం శక్తివంతమైన ‘కాస్మిక్ కిరణాలు’ ప్రసరిస్తూ ఉంటాయి. ఇవి అత్యధిక శక్తి కలిగిన రేణువులు (charged particles). మన భూమికి బలమైన అయస్కాంత క్షేత్రంతో పాటు మందపాటి వాతావరణ రక్షణ కవచం ఉంది. కాబట్టి ఈ ప్రమాదకర కిరణాలు పైనే నశించిపోతాయి, భూమిపై ఉండే కెమెరాలు లేదా మనుషులకు ఎలాంటి హానీ జరగదు. కానీ మంగళ గ్రహానికి అలాంటి అయస్కాంత రక్షణ కవచం లేదు. అక్కడి వాతావరణం కూడా భూమితో పోలిస్తే అర్ధ శాతం మాత్రమే ఉంటుంది. దీనివల్ల అంతరిక్షంలో ప్రయాణించే ఈ కిరణాలు నేరుగా వచ్చి రోవర్ డిజిటల్ కెమెరా సెన్సార్లను (సిలికాన్ డిటెక్టర్లు) బలంగా తాకుతాయి. అలా కాస్మిక్ రేణువులు కెమెరా సెన్సార్‌ను ఢీకొట్టినప్పుడు ఫొటోలలో సాంకేతిక లోపం (Digital Glitch) ఏర్పడుతుంది. జెపిఎల్ (JPL) ఇమేజింగ్ సైంటిస్ట్ జస్టిన్ మ్యాకీ తెలిపిన వివరాల ప్రకారం… ప్రతి వారం రోవర్లు పంపే వేలాది ఫొటోల్లో ఇలాంటి కాంతి చుక్కలు కనిపిస్తుంటాయి. చాలావరకు ఇవి తెల్లటి చుక్కలుగానో లేదా గీతల్లాగో పడతాయి.
కానీ కొన్నిసార్లు తెల్లగా రావడానికి బదులుగా డిజిటల్ లోపం వల్ల నల్లటి మచ్చలుగా (Dark Shadow) రూపాంతరం చెందుతాయి. గతంలో కూడా హెచ్ఏజెడ్క్యామ్ (Hazcam) వీడియోలో ఇలాంటి నల్లటి ఆకారం రికార్డయ్యింది. సరిగ్గా ఈ ఫొటో విషయంలోనూ అదే జరిగింది. కెమెరా సెన్సార్‌ను కాస్మిక్ కిరణం తాకడం వల్ల ఏర్పడిన నల్లటి మచ్చ, చూడటానికి ప్రమాదకరమైన జెల్లీఫిష్‌లా కనిపిస్తూ మనల్ని భ్రమకు గురిచేసింది. ఏ రక్షణ కవచం లేని రెడ్ ప్లానెట్‌పై రోవర్లు పనిచేయడం చాలా సవాలుతో కూడుకున్న విషయం. అంతరిక్ష రేడియేషన్ నేరుగా రోవర్ సెన్సార్లపై దాడి చేయడం వల్లే ఇటువంటి భ్రమలు ఏర్పడుతుంటాయి. ఏది ఏమైనా, అంగారక గ్రహాన్ని ఆసక్తికరంగా మార్చడానికి ఎలాంటి ఏలియన్ జెల్లీఫిష్లూ అవసరం లేదని, అక్కడి సైన్స్ అండ్ టెక్నాలజీయే ఎంతో అద్భుతమైనదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు!
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?