కరోనాకు మందును పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒమిక్రాన్ మందులో ఏఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆనందయ్య ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయుష్…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనందయ్య పిటీషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ఉన్నానని, ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ 19 కి చేస్తున్నామని, మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, నెల్లూరు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆయుష్ కమీషనర్‌లను చేర్చారు. ఈ కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనందయ్య…
ఆనందయ్య మెడిసిన్‌పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో సీవీఆర్ ఫౌండేషన్ బిల్టింగ్‌లో అనధికారికంగా వేల మందికి మందు తయారు చేస్తున్నారని, ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని ఆయుష్ కమీషనర్, స్టేట్ హెల్త్ ప్రకటించినా ఎందుకు మందును పంపిణీ చేయడంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలనే ఇలా చేస్తున్నారని, అదే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఇన్ని రోజులు అక్రమంగా ఆయన్ను నిర్భందించేవారా…