Ileana D’Cruz : తన ప్రెగ్నెంట్ జర్నీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది.కానీ తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.అయితే వాటిలో అతగాడి ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాచేస్తుంది ఇలియానా.గోవా బ్యూటీ ఇలియానా బేబీ పంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో నటి ఇలియానా చాట్ చేసింది.. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పుకొచ్చింది.ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడంపై మీరు ఆందోళన చెందుతున్నారా.. అని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
‘ఈ ప్రశ్న మొదట్లో నన్ను ఎంతగానో కలవరపెడుతుంది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అనేక మంది ఆ విషయం గురించే కామెంట్ చేస్తుంటారు. కానీ గత కొన్ని నెలలుగా నా శరీరంలో వస్తున్న మార్పులను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ అంతా నన్ను ప్రేమించే వాళ్లున్నారు. నా లోపల నా బేబీ ఉంది. కాబట్టి ‘బరువు’ అనేది పెద్ద విషయం అయితే కాదు. ఇన్ని కిలోలు మాత్రమే పెరగాలనే నిబంధనలు నేను పెట్టుకోలేదు. మీ శరీరం మాట వినండి. మీకు నచ్చింది చేయండంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లై ను ఇచ్చింది ఇలియానా.మొదటిసారి మీ బేబీ గుండెచప్పుడు విన్నప్పుడు మీకెలా అనిపించింది..అన్న ప్రశ్నకు ‘నేను అనుభవించిన అత్యంత ఆనందమైన క్షణాల్లో ఇది కూడా ఒకటి అని ఆమె చెప్పుకొచ్చింది.ఎంతగా ఆనందపడ్డానో మాటల్లో అయితే వర్ణించలేను. నాకు కన్నీళ్లు, ఆనందం అన్ని ఎమోషన్స్ ఒకేసారి వచ్చాయి’ అని ఇలియానా సమాధానం ఇచ్చింది. మినీ క్యారెట్లు, ఐస్‌క్రీం మరియు పిజ్జా ఎక్కువగా తినాలనిపిస్తోందని ఆమె తెలిపింది. ఇలా ఇలియానా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!