Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె ‘మేకప్ మంత్రి’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ముందు తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి అమర్నాథ్ “మేకప్ మంత్రి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎండలో తిరిగితే కేజీల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్‌తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే అవి ఎక్కడ వస్తున్నాయో హోంమంత్రి ప్రజలకు వివరించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తాము చేసే రాజకీయ పోరాటం వేరని, అధికారంలో ఉండి చేసే వ్యవహారాలు తమకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
తనపై విమర్శలు చేసే ముందు హోంమంత్రి ఆలోచించాలని అమర్నాథ్ సూచించారు. తాను గతంలో ఉపయోగించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్నే ప్రస్తుతం ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితిలో తన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. పదవి వచ్చిందని కొందరు గన్మెన్లతో తిరుగుతున్నారని, కానీ తమకు గన్మెన్ల అవసరం లేదని అమర్నాథ్ అన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా వేలాది మంది పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని పేర్కొన్నారు.
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
రాజకీయాల్లో కొందరు గాలికి వచ్చి గాలికే వెళ్లిపోతారని వ్యాఖ్యానించిన అమర్నాథ్.. అలాంటి నాయకుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్తులో తగిన రాజకీయ సమాధానం ఇస్తామని హెచ్చరించారు. అధికారాన్ని ఉపయోగించి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన అమర్నాథ్, ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది తీర్పు చెబుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు శాశ్వతం కాదని, రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చని వ్యాఖ్యానించారు. అయితే, అమర్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత లేదా అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!