అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.