అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు…