అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్నారు.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయ్యిందన్నారు..