Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాల నిర్మల్‌కు రానున్నారు. భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ రానున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది..…