Ambati Rambabu: మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం.. ప్రాజెక్ట్‌పై మంత్రి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Gives Update On Polavaram Project: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో భేటీ అయిన ఆయన.. ప్రాజెక్ట్ పనుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ప్రాజెక్ట్‌కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద అగాధా ఏర్పడ్డాయన్నారు. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు తేలిందన్నారు.
Uttar Pradesh: యూపీలో దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
NHPC, DDRP, PPA బృందాలు అన్ని విధాలుగా పరిశీలన చేసి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించారని అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి.. మిగతా పనుల్లో ముందుకు వెళ్లవచ్చని ఆ బృందాలు సూచించాయన్నారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చేపడతామని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్న ప్రాంతాలను రిపేర్ చేసిన తర్వాత ECRF డ్యాం పనులు మొదలుపెడతామన్నారు. వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం కానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. ఈ సీజన్ లో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే రోజు కోసం.. రాష్ట్ర ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారని వెల్లడించారు.
మానవ తప్పిదం వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు చాలా నష్టం జరిగిందన్న అంబటి రాంబాబు.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే ఆలోచన చేస్తామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలనే కంగారు లేదని, అతి జాగ్రత్తగా పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!