Canadian Billionaire Couple Family Offers 35 Million Dollars To Nab Killer: ఐదేళ్ల క్రితం తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన కెనడియన్ బిలియనీర్ దంపతుల డెత్ మిస్టరీ ఇంకా వీడని నేపథ్యంలో.. హంతకుడిపై అక్షరాల రూ. 300 కోట్ల నజరానా ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ ప్రకటన ఇచ్చారు. ఎవరైతే హంతకుడ్ని పట్టిస్తారో, వాళ్లకి ఆ భారీ మొత్తం క్షణాల్లోనే ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. సంఘటనా స్థలంలో అలాంటి ఆనవాళ్లు కనిపించడం వల్ల, ఆత్మహత్యేనని ప్రాథమిక విచారణలో తేల్చారు. కానీ.. ఆ తర్వాత హత్యగా అని తేలడంలో, నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. ఐదేళ్లయినా ఇంతవరకూ అతడ్ని పట్టుకోలేకపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Shraddha Walker Like Incident: శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన.. మహిళను చంపి, 50 ముక్కలు చేసి..
అది 2017 డిసెంబర్ 15వ తేదీ. ఆ రోజు డ్రగ్ దిగ్గజం అపోటెక్స్ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్ (75), తన భార్య హనీ (70)తో కలిసి ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ఇంతలోనే ఓ దుండగుడు వారి ఇంట్లోకి చొరబడి, ఇద్దరినీ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని చూసి.. ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. కానీ.. విచారణలో మాత్రం వాళ్లు హత్యకు గురైనట్టు తేలింది. ఒకవేళ పోలీసులు వాళ్లది ఆత్మహత్య అని మొదట్లో భ్రమ పడకపోయి ఉంటే, బహుశా హంతకుడు దొరికేవాడేమో! కానీ.. వాళ్లు చేసిన తప్పు కారణంగా హంతకుడు ఇంతవరకు దొరకలేదు. అసలు అతనెవరో కూడా తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయింది. ఇది హత్య అని తేలినప్పటి నుంచి.. హంతకుడ్ని పట్టుకోవడం కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఐదేళ్లైనా.. అతడ్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబ సభ్యులు.. హంతకుడ్ని పట్టిస్తే, రూ. 300 కోట్ల నజరానా ఇస్తామని ప్రకటించారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం, తమని ఆవేధనకు గురి చేస్తోందని కుమారుడు జోనాథన్ షెర్మాన్, కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమవుతున్నారు. సాధ్యమైనంతవరకు ఈ కేసుని చేధించి, నిందితుడ్ని పట్టుకోవాలని వారు పోలీసుల్ని కోరారు. కాగా.. పోలీసులు ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది అనుమానితుల్ని విచారించినా, ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు.. ఆ దంపతులు చనిపోయేటప్పటికీ వారి ఆస్తుల విలువ రూ. 20 వేల కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. రూ. 400 కోట్ల డబ్బును వారు దాతృత్వ సేవలకు వినియోగించినట్టు తెలిసింది.
Ambati Rambabu: మేము కాదు గాడిదలం.. నువ్వే అడ్డగాడిదవి.. పవన్ పై అంబటి ఫైర్