పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని తప్పిదాలపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవినేని ఉమాలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. డయాఫ్రమ్ వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిందో చర్చ జరిగి తీరాల్సిందేనని ఆయన ముక్తకంఠంతో అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రక తప్పిదమన్న రాంబాబు.. ఆ తప్పు వల్లే వరదలకు వాల్ దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్‌కు మరమ్మత్తులు చేపట్టాలా? లేక కొత్తది నిర్మించాలా?…