YSRCP: వైసీపీ ‘పోరుబాట’.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'పోరుబాట'..
- విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు..
- రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Read Also: Vikarabad: తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాలను విధించడాన్ని ఖండిస్తోంది వైసీపీ.. రేపు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. పెంచిన విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు అన్ని వర్గాలపై ఆర్థికంగా భారాన్ని మోపుతోందంటున్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.. కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా తయారైందంటున్నారు.
Read Also: Pushpa -2 Collections : రూ. 100 కోట్లైతే బాహుబలి ఔట్.. రూ. 200 కోట్లైతే హిస్టరీ.!
ఆరు నెలల్లో ప్రజలపై 15,485 కోట్ల మేరా విద్యుత్ భారం మోపారాని వైసీపీ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేశామంటుంది. రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారన్నారని… గతంలో వేసవిలో బొగ్గు సరఫరా లేకున్నా విద్యుత్ కోతలు లేకుండా చేశామని గుర్తు చేస్తున్నారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందంటున్నారు.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు వైసీపీ పోరాటాలు కొనసాగిస్తుందంటున్నారు.. ఇప్పటికే రైతు సమస్యలపై నిరసన కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ తాజాగా విద్యుత్ పై పోరుబాట పట్టింది.. జనవరి 3న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ పై వారి తరఫున మరో కార్యక్రమాన్ని నిర్వహించనుంది.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా ఆందోళనలు చేపట్టి వైసీపీ క్యాడర్ తో పాటు లీడర్లను కూడా నిత్యం ప్రజల్లో ఉంచేలా ఆ పార్టీ అధినేత జగన్ ఇంకా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!