రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ఇల్లు అలకగానే పండగ కాదు.. రేపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో మీరే ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ ఆలోచనా సరళి కుంచిత పోకడలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. కానీ, పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టాడు అని దుయ్యబట్టారు..
వైసీపీ మహిళా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ మహిళా విభాగం.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తోంది.. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం..
పార్టీ అధినేత జగన్ హాజరుకాకపోయినా...నిరసన కార్యక్రమాలు జనంలోకి వెళ్లాయి. విద్యుత్ పోరుబాటలో జగన్ ఎక్కడో ఓ చోట నిరసనల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయట. ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయకుండా...నిరసన చేపట్టిన రోజే పులివెందుల నుంచి బెంగుళూరుకు వెళ్ళటం...ఆ పార్టీ కార్యకర్తలను కొంత నిరుత్సాహ పరిచిందట. ఆయన ధర్నాల్లో పాల్గొనకపోవటంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.
విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన…
పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసగా.. ఓవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా… మరోవైపు.. టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ కౌంటర్‌గా కార్యక్రమాలను పూనుకుంది… ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు చేపట్టాలి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని…