ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గత ఏడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు జగన్.. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది..…
సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..