అదానీ కేసుల వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు.. ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్ జగన్.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.