YS Jagan: మనం గట్టిగా మూడేళ్లు పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే..
- ఏడాది గడిచింది.. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి..
- మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడాలి..
- ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనన్న వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు..
Read Also: Motorola Razr 60 ultra: ఇట్స్ కన్ఫామ్.. మే 13న భారత్‌లో విడుదకు సిద్ధమైన మోటరోలా రేజర్ 60 అల్ట్రా.!
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
నాడు–నేడు లేదు. ఇంగ్లీస్ మీడియం లేదు… పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు.. గవర్నమెంట్ బడులు రివర్స్‌లోకి వెళ్లాయి.. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి అన్నారు వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు 700 కోట్లు, అలా ఏటా 2800 కోట్లు, వసతి దీవెన కింద మరో 1100 కోట్లు ఇవ్వాలి.. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది 3900 కోట్లకు బదులు 700 కోట్లు మాత్రమే ఇచ్చాడు.. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం.. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు 300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు.. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో 2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం.. ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది.. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో 2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈరోజు 4.60కి ఒప్పందం చేసుకున్నారు.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి 3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా 1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారని ఆరోపించారు.
Read Also: Asaduddin Owaisi: అఖిలపక్ష భేటీ.. ఆపరేషన్ సిందూర్‌పై ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
ఇక, మద్యం. ఎక్కడ చూసినా అందుబాటులో ఉంది.. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు అని దుయ్యబట్టారు జగన్.. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు.. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే అని విమర్శించారు. బాండ్ల పేరుతో కొత్త అవినీతికి తెరలేపారిన ఆరోపించారు.. ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు.. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!