Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యంపై గత కొంతకాలంగా నెట్టింట, క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడాడు. రాబోయే ప్రపంచకప్ ప్రణాళికల్లో కోహ్లీ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా, జట్టును నడిపించే కీలక లీడర్‌గా భాగస్వామి అయ్యాడని గిల్ స్పష్టం చేశాడు.
“నిజానికి నిన్న కాక మొన్ననే (శనివారం) నేను, విరాట్ భాయ్ కూర్చుని 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించాం. జట్టు కాంబినేషన్స్ ఎలా ఉండాలి, స్క్వాడ్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం జట్టులో లేకపోయినా భవిష్యత్తులో మనకు కీలకమయ్యే ఆటగాళ్లు ఎవరు, ఏ ప్లేయర్ ఏ స్థానంలో సరిగ్గా సరిపోతాడు.. అనే విషయాలపై మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం” అని గిల్ వివరించాడు. గతంలో టెస్ట్, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ జట్టు వ్యూహాల్లో అంతగా యాక్టివ్‌గా పాల్గొనలేదు. అంతేకాకుండా, తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని చోట ఎక్కువ కాలం కొనసాగలేనని కోహ్లీ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో.. గిల్ కెప్టెన్సీలో కోహ్లీ ఎంత ప్రాధాన్యమైన వ్యక్తినో ఈ తాజా చర్చ స్పష్టం చేస్తోంది. ఇది జట్టులో కోహ్లీ ప్రాధాన్యతను మరింత పెంచేలా ఉంది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
గణాంకాల పరంగా చూస్తే వన్డేల్లో భారత్ తరఫున ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లందరిలోకి విరాట్ కోహ్లీదే అత్యుత్తమ రికార్డ్. ఆయన 95 వన్డే మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించి, ఏకంగా 65 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. కోహ్లీ విన్నింగ్ పర్సంటేజ్ 68.42 శాతంగా ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వయసుపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ, వన్డే జట్టుకు వీరిద్దరూ ఎంత అవసరమో కెప్టెన్ గిల్ మరోసారి నొక్కిచెప్పాడు. గత దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ విభాగానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే వెన్నెముకగా నిలిచారని, ప్రస్తుతం కూడా వారు జట్టులో విడదీయరాని భాగమని కొనియాడాడు. విభిన్నమైన పిచ్‌లపై, విభిన్న దేశాల్లో వారిద్దరూ చూపించిన ప్రతిభ, వారికి ఉన్న అపారమైన అనుభవం జట్టుకు ఎంతో విలువైనవని గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!