Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin: అఖిల్ అక్కినేని కెరీర్లో భారీ విజయంగా దూసుకెళ్తున్న ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిల్‌కు ఇది కెరీర్లోనే అత్యంత బలమైన ఓపెనింగ్గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందనను అందుకుంటోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత 24 గంటల్లో ఒక్క బుక్‌మైషోలోనే 74 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది. థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో తొలి వారంలోనే ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా విజయంలో అఖిల్ నటనతో పాటు సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చిందని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలో వినిపించకుండా మిగిలిపోయిన ఒక పాటపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సంగీత దర్శకుడు తమన్ కీలక ప్రకటన చేశారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అన్‌రిలీజ్డ్ సాంగ్‌ను 2026 జూలై 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటను గుంటూరులో నిర్వహించనున్న ‘లెనిన్’ గ్రాండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికగా తొలిసారిగా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.
Also Read
ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. అక్కినేని నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఈశ్వరి రావు, బ్రహ్మాజీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ‘లెనిన్’కు ఈ సక్సెస్ సెలబ్రేషన్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!