Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నేడు విచారణ..
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్..
- వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు కృష్ణాజిల్లా పోలీసులు.. మరోవైపు.. వంశీ అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.. వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో.. హైకోర్టును ఆశ్రయించారు వల్లభనేని..
Read Also: New Movies Release: ఒకేరోజు 4 సినిమాలు రిలీజ్.. మరి మీ ఛాయిస్.?
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్‌ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
అయితే, ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారంటూ హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చుకోవావాల్సి వచ్చింది. అయితే, ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడన్నారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.. ఇక, వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు కొట్టిపారేశారు.. మరోవైపు.. టీడీపీ టార్గెట్ లిస్ట్ టాప్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉందంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ విస్తృత ప్రచారం సాగుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విచక్షణ మరిచి వంశీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అంటున్నారు.. వాస్తవానికి వంశీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువకాలం రాజకీయం చేశారు. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీదే వరుసగా రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు.. రెండోసారి గెలిచాక టీడీపీని వదిలి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి జై కొట్టారు.. ఇక, అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. ఓ దశలో శృతిమించి… నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడటం వల్లే వంశీ పేరు హిట్ లిస్ట్‌లో చేరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!