AP Aqua Farming: ట్రంప్ ఎఫెక్ట్.. ఆక్వా రంగంపై పిడుగు..!
- ట్రంప్ నిర్ణయంతో ఆక్వారంగంపై పిడుగు..
- అమల్లోకి భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు..
- ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Aqua Farming: అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇపుడు ఆక్వారంగంపై పిడుగు పడినట్టు చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్నమొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 25 శాతానికి పెంచడంతో ఎగుమతి చేయాలంటే ఇకపై భారీగా పన్నులు చెల్లించాలి. అమెరికా తాజా నిర్ణయంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే 25 వేలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుది.
Read Also: Story Board: నేతల పార్టీ జంప్‌కు చెక్ పడే మార్గమేంటి ? సుప్రీం బ్రేక్ వేస్తుందా ?
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
దీనికి అదనంగా రవాణా, ప్యాకింగ్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఇపుడు రొయ్యల సాగు చేసే రైతులకు గిట్టుబాటు అయ్యేది ఏమాత్రం ఉండదు.. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్నది అర్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యలు, సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ ఆక్వా రంగం మీద ఆధారపడి ఉన్న దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2023-24లో 2.37 బిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యల వాటానే 76 శాతం ఉంది. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గుతూ.. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటన చేసిన రోజునే రొయ్యల కౌంట్ కు ఉండే ధరలను భారీగా తగ్గించేసారు ఎగుమతి దారులు.
Read Also: IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్ నాయర్..
అటు అమెరికా దెబ్బ ఇక్కడి లోకల్ సిండికేట్ల దెబ్బకు ఇపుడు రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫీడ్ రేట్లు అయినా తగ్గించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!