Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- రేపు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు..
- 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలివిడత నిధులు జమ చేయనున్న ప్రభుత్వం..
- అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ద్వారా ఈ ఏడాది తొలి విడతగా రూ.3,125 కోట్ల పంపిణీ..
- 46.85 లక్షల రైతు కుటుంబాలకు కలగనున్న లబ్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా… కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది.
గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
సీఎం చంద్రబాబు పర్యటన ఇలా…
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!