Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక దృష్టి సారించింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆమె పేర్కొన్న తేదీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సిబ్బందిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం పూర్తిస్థాయిలో విచారిస్తోంది. సాయికృష్ణ తల్లి చెబుతున్న తేదీల్లో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బంది ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు విధుల్లోకి వస్తారు అనే సమాచారాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు.
అంతేకాకుండా, మే నెలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బ్యాకప్ చేయాలని స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు, సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేసులో కృష్ణలంక స్వర్గపురిలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. సాయికృష్ణను హత్య చేసి అక్కడే దహనం చేశారని అతని తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్వర్గపురి ప్రాంతాన్ని పరిశీలించారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
విచారణ సందర్భంగా స్వర్గపురిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఇవ్వాలని అక్కడి సిబ్బందిని పోలీసులు కోరారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని సిబ్బంది తెలిపారు. మే 20 నుంచి మే 29 వరకు ఏవైనా ఫుటేజ్‌లు అందుబాటులో ఉంటే ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ, అలాంటి రికార్డులు లేవని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. దీంతో సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!