Rajya Sabha Election: ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో ఏపీ నుంచి ఎవరికీ రాజ్యసభ స్థానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది… అయితే, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.. దీంతో బీజేపీ నుంచి కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి..
Read Also: Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు..
రాజ్యసభ రేస్‌లో ఏపీ బీజేపీ నుంచి మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.. అయితే, బీజేపీ ఇతర రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు ప్రధానంగా పరిశీలిస్తోంది.. వీరిలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రధానంగా ఉంది.. ఆల్రెడీ అన్నామలైకి రాజ్యసభ స్థానం ఇస్తున్నారు అనే ప్రచారం కూడా బాగా జరిగింది.. కానీ, మధ్యలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా రాజ్యసభ సీటును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడిగినట్లుగా సమాచారం.. కానీ, బీజేపీకి డిసైడ్ అవ్వడంతో బీజేపీ లిస్టులో ఎవరున్నారో.. వారికే సీటు వచ్చే అవకాశం కనిపిస్తోంది..
Read Also: Madhya Pradesh: కునో నేషనల్ పార్క్ లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత నిర్వా
అయితే ప్రస్తుతం రాజ్యసభ సీటు తీసుకున్న వాళ్లకి బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కూడా అవకాశం వస్తుందనే చర్చ జరుగుతోంది… 2014-19 మధ్యలో ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా సురేష్ ప్రభు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చేవారికి కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కవచ్చనేది సమాచారం.. అందుకే ఇతర రాష్ట్రాల వారికి ప్రధానంగా బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఏపీలో కొన్ని పేర్లు పరిశీలించినా తమిళనాడు నుంచి అనామలైకి ప్రధానంగా ఈ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా ఎవరిని ఖరారు చేయకపోవడంతో ఎవరి పేరు ప్రకటించవచ్చు అనే చర్చ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది.. ఇవాళ సాయంత్రం లోగా అధికారిక ప్రకటన బీజేపీ నుంచి రాబోతోంది..