TDP: టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
- టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..
- ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు..
- తప్పనిసరిగా కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి..
- చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి..
- వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో ఆహ్వానించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటిమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరికలు భారీగా పెరిగిపోయాయి.. అయితే, ఇప్పుడు అదే పార్టీకి సమస్యగా మారిందా? అనే చర్చ సాగుతోంది.. దానికి అనుగుణంగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
Read Also: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీటీడీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. వారి గురించి పూర్తి కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత.. పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని టీడీపీలోని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు.. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకు సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు..
Read Also: Harish Rao: రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు
కాగా, మహానాడు సహా ఇతర సమావేశాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు.. వారితో జాగ్రత్త.. ఇక్కడి విషయాలు అక్కడకి చేరిపోతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు, శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!