చేసిన సినిమాలు కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

 ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది.

అలాగే కొన్ని షోస్ కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

తాజాగా ఆమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 కోసం రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీ గోల్డెన్ గర్ల్ అంటూ క్యాప్షన్ ఇచ్చి పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంకేముంది అనసూయ అభిమానులు ఆమె ఫోటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.