ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది
Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసుపై ఉత్కంఠ నెలకొంది.. దానికి కారణం.. నేడు సుప్రీకోర్టులో అమరావతి రాజధాని కేసుపై విచారణ జరగనుంది.. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అమరావతి రైతులు.. అయితే, ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య…